Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిరిజన వనంలో విరబూసిన మందారం

గిరిజన వనంలో విరబూసిన మందారం

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర: పేద కుటుంభం లో జన్మించి కష్ట పడి  గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఫలితాలలో ఉత్తమ ర్యాంక్ సాధించి మండలానీకే ఆదర్శంగా నిలిచారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి సాగర్ మండలం ఎర్రచెరువు తండా గ్రామానికి చెందిన రామావత్   గ్రూప్-2 ఎగ్జామ్ లో 1125  ర్యాంకు, గ్రూప్-3 లో 1355 ర్యాంకు సాధించి మాండల్ పంచాయతీ ఆఫీసర్  పోస్ట్ ను పొంది నియామక పత్రాన్ని శనివారం మాజీ మంత్రి పెద్దలు కుందూరు జానారెడ్డి, స్థానిక శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. గ్రూప్-2,గ్రూప్-3 లో ర్యాంకు సాధించి ఎంపీఓ గా జాబ్ సాధించి నందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలు, తిరుమల గిరి సాగర్ మండల ప్రజలు హర్షం వ్యకం చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అంగోత్ భగవాన్ నాయక్,మాజీ ఎంపీటీసీ తారసింగ్, మాజీ ఉప సర్పంచ్ రమేష్, యువ నాయకులు రాజు తదితరులు పాలుగోన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -