హీరో అథర్వా మురళీ నటించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రం ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీని తెలుగులోకి ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలు పెంచేశారు.
‘యూనిఫామ్ వేసుకున్న తరువాత అందరూ ఫ్యామిలీనే’ అని ట్రైలర్‌లో హీరో చెప్పిన డైలాగ్ చూస్తే ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ఇక ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, లవ్ ట్రాక్‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి, అధర్వ కాంబో అందరినీ అలరించేలా ఉంది. గ్రిప్పింగ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్‌ను కట్ చేశారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రానికి సంగీతం :జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రాఫర్ : శక్తి శరవణన్, ఎడిటర్ : కలైవానన్.
సరికొత్త యాక్షన్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES