జీఎంఆర్ స్పోర్ట్స్-ప్రభుత్వం మధ్య చారిత్రాత్మక ఒప్పందం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జీఎంఆర్ స్పోర్ట్స్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగింది. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ రైజింగ్ అజెండా కింద రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్తు దృక్పథానికి జీఎంఆర్ తమ సహకారాన్ని అందిస్తున్నది. దుబాయ్ స్పోర్ట్స్ సిటీని జ్ఞాన భాగస్వామ్య సంస్థగా చేసుకొని, జీఎంఆర్ స్పోర్ట్స్ భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక శిక్షణా కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త స్టేడియాలు, హై-పర్ఫార్మెన్స్, రిహాబిలిటేషన్ సెంటర్లు, స్పోర్ట్స్ సైన్స్ సదుపాయాలు వంటి అంతర్జాతీయ ప్రమాణాల వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రణాళిక తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ హబ్‌గా నిలబెట్టడమే లక్ష్యమని జీఎంఆర్ స్పోర్ట్స్ సంస్థ ప్రకటించింది. ఒప్పందం సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మెన్ జీఎంఆర్ స్పోర్ట్స్ చైర్మెన్ కిరణ్ కుమార్ గ్రంధి మాట్లాడుతూ ”తెలంగాణ ప్రభుత్వంతో కలిసి శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయడం ద్వారా క్రీడా రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాము.
ఈ కార్యక్రమం తెలంగాణను వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ క్రీడా కేంద్రంగా నిలబెడుతుంది” అని అన్నారు. దుబాయ్ స్పోర్ట్స్ సిటీ సేల్స్, లీజింగ్, ఇన్వెస్ట్మెంట్ హెడ్ రానియా ఓస్లాటి మాట్లాడుతూ ”భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ రూపకల్పనలో భాగస్వామ్యం కావడం మా గర్వకారణం. ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా వసతులను తెలంగాణకు అందించేందుకు సహకరిస్తుంది,” అని వ్యాఖ్యానించారు. ఈ విధానం కింద తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులు, మద్దతు అందించనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ, భారత్‌లో తొలి నెట్-జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా రూపుదిద్దుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, లైఫ్ సైన్సెస్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలలో కొత్త పెట్టుబడులు, అవకాశాలను ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటి, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నదని జీఎంఆర్ సంస్థ అభిప్రాయపడింది.
తెలంగాణ క్రీడారంగంలో నూతన అధ్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



