Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబోడేపూడి స్ఫూర్తితో నూతన తీరాన్ని సృష్టించాలి

బోడేపూడి స్ఫూర్తితో నూతన తీరాన్ని సృష్టించాలి

- Advertisement -

విలువలతో కూడిన రాజకీయాలు అందించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌
గండగలపాడులో బోడేపూడి 28వ వర్థంతి సభ
నవతెలంగాణ-వైరాటౌన్‌

రాజకీయాలంటే అధికారం, పదవులు, డబ్బులు సంపాదించడం కాదని.. ప్రజల కోసం నిలబడటం, ప్రజల సమస్యలపై కలబడటం, వ్యవస్థ మార్పు కోసం, ఎర్రజెండా రాజ్యం కోసం త్యాగాలు చేయడమేనని బోడేపూడి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం బోడేపూడి స్వగ్రామం గండగలపాడు గ్రామంలో మంగళవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మార్క్సిస్టు ఉద్యమ నిర్మాత, ప్రజానాయకుడు, ఆదర్శ రాజకీయవేత్త, రైతు బాంధవుడు కామ్రేడ్‌ బోడేపూడి వెంకటేశ్వరరావు 28వ వర్ధంతి సభ సీపీఐ(ఎం) వైరా డివిజన్‌ కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా మణి అధ్యక్షతన జరిగింది. బోడేపూడి చిత్రపటానికి పోతినేని సుదర్శన్‌రావు పూలమాల వేశారు. బోడేపూడి స్థూపం వద్ద పార్టీ జెండాను జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు ఎగురవేశారు. అనంతరం పోతినేని సుదర్శన్‌రావు, బొంతు రాంబాబు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటాలను, బాధ్యతలను బోడేపూడి నిర్వహించారని గుర్తుచేశారు. సిద్ధాంత నిబద్ధత, పార్టీ పట్ల బాధ్యతతో విలువైన రాజకీయాలని అనుసరించారని తెలిపారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, లౌక్యంతో కూడిన బహుముఖ పాత్రలను పోషించిన బోడేపూడిని ఆదర్శంగా తీసుకొని కొత్త తరాన్ని సృష్టించడం.. నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలను అందించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని అన్నారు. జీవితాంతం ప్రజలను అంటిపెట్టుకుని ఉన్న బోడేపూడి ఆదర్శాలను ముందుకు తీసుకు పోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. సీపీఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సీనియర్‌ నాయకులు షేక్‌ జమాల్‌ సాహేబ్‌, మల్లెంపాటి రామారావు, గుమ్మా నరసింహారావు, కామినేని రవి, గుడిమెట్ల మోహన్‌రావు, కొంగర సుధాకర్‌, షేక్‌ నాగుల్‌ పాషా, పాపకంటి రాంబాబు, వాసిరెడ్డి విద్యాసాగర్‌రావు, ఇమ్మడి వీరభద్రం, కంసాని మల్లికాంబ, కిన్నెర మోతియా పల్లెబోయిన కృష్ణ, గుడ్ల లక్ష్మయ్య, చిత్తారు మురళి, బొల్లెపోవు తిరుపతిరావు, బల్లెపోగు శ్రీనివాసరావు, మోటపోతుల వెంకటేశ్వరరావు, వడ్లమూడి మధు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -