మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తోట శ్రీకాంత్ రచన, దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన చిత్రం ‘థ్యాంక్యూ డియర్’. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలు పోషించారు. ఆగస్టు 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘ట్రైలర్‌లో ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. అయితే అప్పటికే రేఖానిరోషాతో పెళ్లయిన ధనుష్ రఘుముద్రి ట్రైలర్ చూస్తుంటే హెబ్బా పటేల్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. వారి ఇద్దరితో ధనుష్ ఎలా మేనేజ్ చేశాడు అనేది ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్‌లోని డైలాగులు నవ్విస్తూనే, ట్రెండ్‌కు తగ్గట్లు ఉన్నాయి. అలాగే సినిమాలో ఎన్నో మలుపులతో ఉన్న సస్పెన్స్ ఉన్నట్లు అర్థమవుతుంది. ట్రైలర్‌లోని బిజిఎం, విజువల్స్ నిర్మాణ విలువల రేంజ్‌ని తెలియజేశాయి’ అని మేకర్స్ తెలిపారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ : పప్పు బాలాజీ రెడ్డి, రైటర్, డైరెక్టర్ – తోట శ్రీకాంత్ కుమార్, ఎడిటర్ : రాఘవేంద్ర పెబ్బేటి, మ్యూజిక్ – సుభాష్ ఆనంద్, డిఓపి : పి ఎల్ కె రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ – బలిజ పునీత్ రాయల్, కో ప్రొడ్యూసర్ – పిబివివి.సత్యనారాయణ.
సరికొత్త ముక్కోణ ప్రేమకథ
- Advertisement -
- Advertisement -