హీరో తిరువీర్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టారు. దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్‌కు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు స్వరూప్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సరదా, సందడితో కూడిన ఓ అద్భుతమైన ప్రేమకథగా ఉండబోతోంది. ఈ చిత్రానికి సంబధించిన ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి, స్క్రీన్ ప్లే: మహేందర్ కుడుదుల, రవీంద్ర ఎల్వీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొమిరి బాలసుబ్రహ్మణ్యం.
సరికొత్త పల్లెటూరి ప్రేమకథ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



