నవతెలంగాణ-హైదరాబాద్ : పరీక్షలు ముగిసాయి, హాస్టళ్లు నిండిపోయాయి, మొదటి “భారీ “కొనుగోలు ఫోన్లు, ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్లు, మరియు ఫ్యాషన్ లతో ప్రారంభమైంది. చాలామంది యువ వయోజనులకు, ఈ పండగ సీజన్ కొత్తగా కనుగొన్న ఆర్థిక స్వాతంత్ర్యంతో కలిసి వచ్చింది. ఇది మోసగాళ్లు కూడా సంచరించే సమయం. వెబ్ సైట్ లోని చిన్న అక్షరాలను టీన్స్ మరియ కాలేజీ విద్యార్థులు చదవడానికి సహాయపడటంలో తల్లిదండ్రులు మరియ సంరక్షకులు కూడా కీలకమైన బాధ్యతవహిస్తారు: మోసగాళ్లను గుర్తించండి, అత్యవసరతను ప్రశ్నించండి, మరియు డబ్బు మరియు గుర్తింపులను సురక్షితంగా ఉంచే అలవాట్లను రూపొందించండి.
“ఇంట్లో మా పద్దతి చాలా సాధారణమైనది: మొదట ఆపుచేయండి, తరువాత క్లిక్ చేయండి. వేగంగా ‘ధృవీకరణలు‘ చేయడంలో కుటుంబాలను మేము ప్రోత్సహిస్తాం, మీ ఆర్డర్లు తనిఖీ చేయడానికి అధికారిక అమేజాన్ ఆప్ వాడండి, మల్టి-ఫ్యాక్టర్ ప్రామాణీకరణను ఆన్ చేయండి మరియు గిఫ్ట్-కార్డ్ చెల్లింపుల కోసం ఏదైనా డిమాండ్ ను స్టాప్ చిహ్నంగా భావించండి. ఈ సూక్ష్మ అలవాట్లు ప్రధానమైన సమస్యల్ని నివారిస్తాయి,” రాకేష్ బక్షి, వైస్ ప్రెసిడెంట్ – లీగల్, అమేజాన్ ఇండియా అన్నారు.
కుటుంబాలు కలిసికట్టుగా ఎదుర్కొనే సాధారణ ఆన్ లైన్ హానులు
ఫిషింగ్/అనుకరణ: డబ్బు లేదా వివరాలు దొంగతనం చేయడానికి నమ్మకమైన బ్రాండ్స్ గా అనుకరించే సందేశాలు.
సురక్షితం కాని యాక్సెస్ ద్వారా అకౌంట్ దొంగలించడం: సైట్స్ లో పాస్ వర్డ్స్ ను మళ్లీ వినియోగించడం, బలహీనమైన పాస్ వర్డ్స్ వాడటం, సురక్షితంగా లేని వై-ఫై, లేదా నకిలీ పేజీలు ద్వారా లాగింగ్ ఇన్ వంటివి.
అనుకరణ/మోసాల ప్రయత్నాలను గుర్తించడం & ఆపుచేయడంలో యువ వయోజనులకు ఏ విధంగా సహాయపడాలి (శీఘ్ర తనిఖీలు)
యాప్ లో ధృవీకరించండి: “ఆర్డర్“ లేదా “అకౌంట్ సమస్య“ అలర్ట్ వచ్చినట్లయితే, అమేజాన్ యాప్/వెబ్ సైట్ లో మీ ఆర్డర్లు తనిఖీ చేయండి- ఆర్డర్ అక్కడ లేకపోతే, అది వాస్తవం కాదు.
సెండర్ & లింక్ ని తనిఖీ చేయండి: పూర్తి ఇమెయిల్/URL చూడండి; క్లుప్తమైన లింక్స మరియు టైపోస్ తో జాగ్రత్తగా ఉండండి (ఉదా., “amaza.co”).
అత్యవసర ఉచ్చులు పట్టించుకోవద్దు: “ఇప్పుడు చర్య తీసుకోండి”, “ఫీజు కావాలి”, “ఈ సాధనం ఇన్ స్టాల్ చేయండి” వంటివి ప్రమాదకర చిహ్నాలు- ఆగండి మరియు ధృవీకరించండి.
మెసేజ్ ల నుండి క్లిక్ చేయవద్దు: యాప్/వెబ్ సైట్ కి నేరుగా నేవిగేట్ చేయండి; అభ్యర్థించని ప్రాంప్ట్స్ నుండి ఎన్నడూ పాస్ వర్డ్స్ నమోదు చేయవద్దు.
ఫ్యామిలీ ప్లేబుక్: నిఘా అనే భావనను కలగనీయని సాధారణమైన భద్రతా సలహాలు
ముఖ్యమైన అకౌంట్లలో శక్తివంతమైన, విలక్షణమైన పాస్ వర్డ్ +MFA వాడండి.
సక్రమమైన చోట పేరంటల్ కంట్రోల్స్ ప్రారంభించండి; తెలియని లింక్స్/డౌన్ లోడ్స్ కోసం కుటుంబపు ప్రమాదకర తనిఖీ జాబితాలను ఆమోదించండి.
మోడల్ కామ్ రికవరీ: మీరు అనుమానస్పద ప్రాంప్ట్స్ ను ఏ విధంగా ఎదుర్కొంటారో పిల్లల్ని చూడనీయండి- వయోజనుల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారు.
కలిసి నేర్చుకోండి: అమేజాన్ వారి నేషనల్ సైబర్ సెక్యూరిటీ అలియెన్స్ (బైట్-సైజ్ పాఠాలు + క్విజ్ లు)తో సహ అభివృద్ధి చేయబడిన ఇంటరాక్టివ్ మైక్రోసైట్ ప్రొటక్ట్ & కనక్ట్ ఉచిత వ్యవస్థలు సహా కొనుగోళ్లు చేసేటప్పుడు
ఫోన్/ఇమెయిల్ ద్వారా అమేజాన్ ఎన్నడూ చెల్లింపులను కోరదు, గిఫ్ట్ కార్డ్స్ ను డిమాండ్ చేయదు లేదా మద్దతు కోసం సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరదు.
మీకు ఏదైనా ఊహించని “ఆర్డర్ నిర్థారణ” లేదా “అకౌంట్ సమస్య” కలిగితే, యాప్ లో మీ ఆర్డర్లు తనిఖీ చేయండి; అది జాబితాలో లేకపోతే అది నిజం కాదు.
నివేదించండి: అమేజాన్ వారి ఇన్-యాప్/సెల్ఫ్ –సర్వీస్ నివేదికను వాడండి. కస్టమర్లు కాని వారు reportascam@amazon.comకి ఇమెయిల్ చేయవచ్చు; ఫిషింగ్ ఇమెయిల్స్ ను stop-spoofing@amazon.comకి పంపించండి- నివేదికలు అమేజాన్ చెడు నటుల్ని వేగంగా నియంత్రించడానికి సహాయపడతాయి.
A-to-Z గ్యారంటీపై ఆధారపడండి: అమేజాన్ యాప్/వెబ్ సైట్ లోపల కొనుగోళ్లు చేయండి; అమేజాన్ కొనుగోళ్లకు మద్దతునిస్తుంది మరియు డెలివరీని పరిష్కరించడంలో లేదా వస్తువుల పరిస్థితి సమస్యల్ని వేగంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది.
సురక్షితమైన షాపింగ్ కోసం తన నిబద్ధతకు అనుగుణంగా, అమేజాన్ ఇండియా మోసాలు లేని సెప్టెంబర్ ను పాటించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), హోం వ్యవహారాల శాఖతో భాగస్వామ్యం చెందింది. ఈ పండగ సీజన్ లో ఆన్ లైన్ భద్రత గురించి చైతన్యం వ్యాప్తి చేయడానికి, స్మార్ట్, మోసాలు లేని అలవాట్లను రూపొందించడానికి కుటుంబాలు మరియు యువ వయోజనులను సమర్థవంతుల్ని చేయడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, అమేజాన్ మరియు I4Cలు కఠినమైన మోసపూరితమైన పరిస్థితులను సులభంగా అర్థం చేసుకునే భద్రతా సలహాలుగా మార్చే మూడు డిజిటల్ ఫిల్మ్స్ ను కూడా విడుదల చేసాయి.