Thursday, December 11, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

- Advertisement -

నవతెలంగాణ- సారంగాపూర్: మండలం చించొలి(బి) గ్రామానికి చెందిన దేవత రాజేందర్(30)బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజేందర్  బుధవారం రాత్రి  పని అవసర నిమిత్తం టి.ఎస్ 18 సి 4891 నెంబర్ గల  ద్విచక్రవాహన పై ధనిగ్రామానికి వెళ్లి స్వగ్రానికి తిరిగి వస్తుండగా ధని శిబిరంలో మూల మలుపు వద్ద అడవి పంది అడ్డురాగ ప్రమాదం జరిగింది. వాహనం పైనుండి కింద పడి తలకు తీవ్ర  గాయాలు అయ్యాయి.స్థానికు చూసి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో  వెంటనే గాయపడ్డ వ్యక్తిని కారులో నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు.మృతుడు ఆర్మూర్ లో రైల్వేస్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మృతునికి భార్య రంజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని తండ్రి ప్రేమసాగర్  పిరియధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -