Tuesday, January 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅర్థవంతమైన సినిమాకి వేదిక

అర్థవంతమైన సినిమాకి వేదిక

- Advertisement -

రెండు అద్భుతమైన రోజుల పాటు సినిమా శ్రేష్ఠత, సృజనాత్మక మార్పిడి, సాంస్కృతిక వేడుకల తర్వాత నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మూడవ ఎడిషన్‌ ఘనంగా ముగిసింది. ప్రసాద్‌ ఫిల్మ్‌ ల్యాబ్స్‌, రాజ్‌ భవన్‌ సాంస్కృత ఆడిటోరియంలో నిర్వహించిన ఈ ఉత్సవం భారతదేశం, విదేశాల నుండి చిత్రనిర్మాతలు, కళాకారులు, పరిశ్రమ అనుభవజ్ఞులు, సినిమా ఔత్సాహికులను ఒకచోట చేర్చే శక్తివంతమైన వేదికగా నిలవడం విశేషం. రెండు రోజుల ఉత్సవంలో విభిన్న స్వరాలు, ఇతివృత్తాలు, భిన్న సినిమా శైలిని ప్రతిబింబించే ఫీచర్‌ ఫిల్మ్‌లు, షార్ట్‌ ఫిల్మ్‌లు, షార్టర్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలతో అద్భుతమైన చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్‌ హాజరయ్యారు. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి ప్రియాంక ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.

ముగింపు కార్యక్రమంలో జాతీయ చలనచిత్ర అవార్డుల సీనియర్‌ డైరెక్టర్‌ అండ్‌ ఛైర్మన్‌ విఎన్‌ ఆదిత్య; నటుడు అశోక్‌ కుమార్‌, ఎస్‌విఎఫ్‌ఎఫ్‌ఏ ప్రిన్సిపాల్‌ అజిత సురభి తదితరులు ఉన్నారు. ఈ సెషన్‌ను సునీతా కృష్ణన్‌ మోడరేట్‌ చేశారు. ఈ చర్చలో సామాజిక మార్పు, స్వతంత్ర చిత్రనిర్మాణం, డిజిటల్‌ యుగంలో కథనం వంటి వాటిపై సంభాషణలు జరిగాయి. ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘జుయ్ ఫూల్‌’, ఉత్తమ దర్శకుడిగా రాజేష్‌ టచ్‌రివర్‌ (దాహిని — ది విచ్‌), ఉత్తమ లఘు చిత్రంగా క్యారెక్టర్‌, ఉత్తమ దర్శకుడు: హిమజ్యోతితలుక్దార్‌ (ఇలిష్‌), ఉత్తమ చిన్న చిత్రంగా దట్‌ అగ్లీ గ్రీన్‌ ప్లానెట్‌, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా గోల్డెన్థ్రెడ్‌ నిలిచాయి. ఈ సందర్భంగా ఫెస్టివల్‌ డైరెక్టర్‌ డా||జున్మోని దేవి ఖౌండ్‌ మాట్లాడుతూ,’నిరి9 అంటే నిర్భయమైన రీతిలో కథ చెప్పడం. అంతేకాదు అర్థవంతమైన సినిమాలకు వేదిక కూడా’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -