భారతీయ యానిమేషన్ సినిమా ”కికీ అండ్ కోకో” త్వరలో విడుదల కాబోతుంది. ప్రపంచవ్యప్తంగా ఎల్లలు దాటి, పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. పూర్తిగా భారత సినీ ఇండస్ట్రీ నుండి ఇక్కడి సాంకేతిక నిపుణులతో విభిన్న తరహాలో తొలిసారిగా పి. నారాయణన్ దర్శకత్వంలో రూపొందించిన యానిమేషన్ చిత్రమిది. ఈ సందర్భంగా దర్శకుడు పి.నారాయణన్ మాట్లాడుతూ, ‘ఇది పిల్లలకే పరిమితం కాదు. పెద్దల్లోనూ చిన్నప్పటి మధురానుభూతులను మరోసారి గుర్తు చేసే మాయా శక్తి ఇందులో ఉంది. చిన్నారుల వినోదం, విద్యకు కొత్త నిర్వచనం చూపే వినూత్న చిత్రం ఇది. కికీ అనే చాలా ప్రేమికమైన పెంపుడు జంతువు, కోకో అనే చిన్నారి మధ్య ఉన్న అపూర్వమైన బంధాన్ని ఈ చిత్రం చెబుతుంది. ప్రేమ, జీవిత పాఠాలు, అద్భుత క్షణాలతో నిండిన వారి ప్రయాణం అన్ని వయసుల ప్రేక్షకుల హృదయాలను తాకేలా రూపొందించబడింది.
యానిమేషన్ తాలూకా అసలు మేజిక్ ఏ వయసు వారినైనా అలరిస్తూ, ప్రేరేపించే శక్తి ఉంటుంది. అలాంటి యానిమేషన్ ప్రపంచంలో అడుగుపెడుతూ, మేం చేసిన తొలి ప్రయత్నం ఇది. ఈ రోజుల్లో నేటి బాలలను నిజంగా ప్రభావితం చేసే విద్యా కథలు చాలా అవసరం.యానిమేషన్ చిత్రాలు కేవలం హాలీవుడ్ వారు మాత్రమే తీయగలరు అనుకునే వారికీ మేము ఈ జోనర్‌లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సిద్ధంగా ఉందని సగౌరవంగా చెప్పగలం’ అని అన్నారు. ‘ఇది ఒక సినిమా మాత్రమే కాదు. ఇది స్నేహం, ప్రేమ, కథల ద్వారా పిల్లలు నేర్చుకునే విలువైన పాఠాల వేదిక. ఈ మాంత్రిక ప్రయాణాన్ని అందరూ తమ హృదయాలతో స్వాగతించాలని ఆహ్వానం పలుకుతున్నాం’ అని ఇనికా ప్రొడక్షన్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ జి.యం.కార్తికేయన్ చెప్పారు.
విలువైన పాఠాల వేదిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



