- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో సమస్యలు వెలికితీసే కార్యక్రమం అయిన మాస్ లైన్ ను నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి నేతృత్వంలో పండువారిగూడెం,నందిపాడు లో వీధి వీధి పర్యటించారు. అంతర్గత రహదారులు అస్తవ్యస్తం,అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరి లేకపోవడం,ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం,పోడు భూములకు పట్టాలు లేకపోవడం గుర్తించారు. ఈ కార్యక్రమంలో కారం సూరిబాబు,నాగేశ్వరరావు,జోగారావు,రాజబాబు,దుర్గారావు,బాబూరావు,తిరుపతమ్మ లు పాల్గొన్నారు.
- Advertisement -