నవతెలంగాణ – మాక్లూర్
క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని చేపట్టాలని మండల సీపీఐ(ఎం) కార్యదర్శి కొండ గంగాధర్ తెలిపారు. బుదవారం మండలంలోని దాస్ నగర్ గ్రామ శివారులోని 63వ జాతీయ రహదారిపై మండల సీపీఎం పార్టీ ఆద్వర్యంలో నిరసన తెలిపి ప్రధాని నరేంద్ర మోడీ డిస్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కొండగంగాధర్ మాట్లాడుతూ .. కేంద్రంలోని నరేంద్ర మోడీ దేశ సంపదను 60 శాతం పెట్టుబడిదారులకు అనుకూలంగా దేశ సంపదను దోచిపెడుతున్నారన్నారు. ఒక శాతం మాత్రమే పేద ప్రజల యొక్క సంపద మిగతా వ్యాపారాకుల అనుకూలంగా చట్టాలను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటు రంగానికి కట్టబెట్టరాని, రైల్వే, ఎల్ఐసి మొదలైన సంస్థలను, విద్య, వైద్యాన్ని ప్రైవేటుకు అప్పగిన్స్తున్నారని, పెద ప్రజలను రోడ్లపై పడేసే పరిస్థితి వస్తుందని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించినట్లయితే రైతులు యజమానులు పోయి కూలీలుగా మారవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 1942లొ క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగ తీసుకొని క్విట్ కార్పొరేటు ఉద్యమాన్ని కొనసాగించాలని, దీనికి అన్ని రంగాల ప్రజలు ఉద్యమించాలని అఖిల భారతీయ సంఘాలన్నిటిని కలుపుకొని వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి బండారి ఎల్లయ్య, ద్యారంగుల శ్రీనివాస్, రేపని సుదర్శన్, బండారి ఆనంద్, ఉప్పు నవీన్, దండ్ల నర్సింలు పాల్గొన్నారు.
క్విట్ కార్పోరేట్ ఉద్యమం చేపట్టాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES