No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమాఅరుదైన కంటెంట్‌ బేస్డ్‌ సినిమా

అరుదైన కంటెంట్‌ బేస్డ్‌ సినిమా

- Advertisement -

‘పొలిమేర, రజాకార్‌’ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో కెమెరామెన్‌గా కుశేందర్‌ రమేష్‌ రెడ్డికి గుర్తింపు వచ్చింది. ఆయన ‘త్రిబాణధారి బార్బరిక్‌’ చిత్రానికి అందించిన విజువల్స్‌కి మంచి అభినందనలు లభించాయి. డైరెక్టర్‌ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్‌ బ్యానర్‌ మీద విజరు పాల్‌ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్‌ కుశేందర్‌ రమేష్‌ రెడ్డి ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
దర్శకుడు మోహన్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ మూవీకి ప్రధాన బలం కథ. ‘పొలిమేర’, ‘రజాకార్‌’ కథలు విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్‌ కలిగిందో.. ఈ కథను విన్నప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగింది.
ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఇందులో ఉదయ భాను పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే వశిష్టని సరికొత్తగా చూస్తారు. సత్యరాజ్‌ పాత్ర సర్‌ప్రైజ్‌ చేస్తుంది. క్లైమాక్స్‌ని ఎవ్వరూ ఊహించలేరు. ఈ మూవీకి క్లైమాక్స్‌ అద్భుతంగా సెట్‌ అయింది.
ఈ మూవీకి ఎక్కువగా రాత్రి, రెయిన్‌ ఎఫెక్ట్స్‌లోనే చిత్రీకరణ చేశాం. వేసవి కాలంలో రెయిన్‌ సీజన్‌ ఎఫెక్ట్‌ను చూపించడం అంత సులభం కాదు. అదే మాకు పెద్ద ఛాలెంజింగ్‌. ఈ విషయంలో మాత్రం నిర్మాత విజరు డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారు. కథ కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. తెలుగులోనూ కంటెంట్‌ బేస్డ్‌ చిత్రాలు వస్తున్నాయని నిరూపించేందుకు ‘త్రిబాణధారి బార్బరిక్‌’ అనే మూవీ వస్తోంది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad