తెలంగాణ టాప్-20 స్టేట్ బోర్డ్ స్కూల్స్ లో స్థానం
అవార్డు అందుకున్న కరస్పాండెంట్ కార్తీక్ రావు
నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ మరో అరుదైన ప్రతిష్టను సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంపికైన టాప్ 20 స్టేట్ బోర్డ్ స్కూల్స్ లో ఆదర్శ హై స్కూల్ స్థానం సాధించి స్కూల్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. బెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్ స్కూల్, ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్, ఎక్సలెన్స్ ఇన్ ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ వంటి మూడు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపినందుకు ఈ గుర్తింపు లభించింది. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం బ్రెయిన్ ఫీడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈటి టెక్ ఎక్స్ కాన్ఫరెన్స్ లో ప్రముఖుల చేతుల మీదుగా ఆదర్శ హై స్కూల్ కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా కార్తీక్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో చైర్మన్ జనగామ కరుణాకర్ రావు నాయకత్వంలో గత 36 ఏళ్లుగా విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తు ఆధునిక బోధన విధానాలు, 21వ శతాబ్ద నైపుణ్యాలు, ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ పై దృష్టి పెట్టడం వల్ల ఈ గౌరవం లభించిందన్నారు. ఆదర్శ విద్యార్థులు దేశ, విదేశాల్లో అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండడమే దీనికి నిదర్శనం అన్నారు.
రాష్ట్ర స్థాయిలో టాప్ 20 స్కూల్స్‌లో ఆదర్శ హై స్కూల్ ఎంపిక కావడం ఈ ప్రాంతానికి గొప్ప గౌరవం అని తెలిపారు. ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులకు కార్తీక్ రావు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత నాణ్యమైన విద్యతో ప్రతి విద్యార్థిని గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దడం మా లక్ష్యం అని స్పష్టం చేశారు. ఆదర్శ విద్య సంస్థకు లభించిన ఈ గౌరవంపై చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, ప్రిన్సిపల్ జనగామ కృషిత, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.



