అగ్రకథానాయకుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు చేరటం ఓ విశేషమైతే, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగానూ నిలవడం మరో విశేషం.
ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా బాలకృష్ణకు అధికారికంగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
‘బాలకృష్ణ ఐదు దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా నిలిచాయి. ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్ మార్క్‌ను స్థాపించిన వారసత్వం. సంప్రదాయాలతో లోతుగా పాతుకుపోయి ఉండి నిరంతరం తనను తాను పునర్నిన్మించుకునే ఆయన సామర్థ్యం, ప్రముఖ నటుడి ప్రయాణాన్ని మాత్రమే కాకుండా తరాలను కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది’ అని ప్రశంసా పత్రంలో సంతోష్ శుక్లా పేర్కొన్నారు.
భారతీయ సినిమా చరిత్రలో హీరోగా బాలకృష్ణ చేసిన అసాధారణ సేవలకు లభించిన ఈ అరుదైన గౌరవాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ ఈనెల 30న హైదరాబాద్‌లో స్వయంగా బాలకృష్ణకు అందజేయబోతున్నారు.
సినీ రంగానికి చేసిన సేవలకుగానూ కేంద్రప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారంతో బాలకృష్ణను సముచితంగా గౌరవించిందది. అలాగే ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లోనూ బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది.
బాలకృష్ణకు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -