Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిరోజు ఇంటి ఆవరణంలో నిద్రిస్తున్న జెర్రిపోతు

ప్రతిరోజు ఇంటి ఆవరణంలో నిద్రిస్తున్న జెర్రిపోతు

- Advertisement -

నవతెలంగాణ కల్వకుర్తి:

వర్షాకాలంలో సహజంగా పాములు బయట సంచరించడం చూస్తుంటాం. రోడ్లపై వ్యవసాయ పొలాల గట్లపై పాములు కనిపిస్తూ ఉంటాయి.కానీ కల్వకుర్తి పట్టణం శ్రీ సాయి కాలనీలో మార్చాల పంచాయతీ సెక్రెటరీ రమేష్ నివసించే ఇంటి ఆవరణంలోని మెట్లపై ప్రతిరోజు ఒక పాము సాయంత్రం పడుకుంటుంది. ఉదయం లేచి చూడగానే మెట్లపై పాము ఉంటుందని వారు తెలిపారు. ఇది మనుషులను చూసిన కదలడం లేదని ఇది విషపూరితమైనది కాకపోవడంతో దీనికి ఎలాంటి హాని కలిగించకుండా ఉన్నాం. కానీ పిల్లలు ఇంత పెద్ద పాముని చూడడంతో భయపడుతున్నారని, మూడు రోజులుగా ఇలగే వస్తూ వెళ్తుందని, వారు అన్నారు. ఈరోజు తెల్లవారుజామున పాములను పట్టివారిని పిలిపించి పట్టి తీసుకువెళ్లి వ్యవసాయ పొలాలలో వదిలినట్లు రమేష్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -