Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉమెన్ హాకీ నేషనల్ ఛాంపియన్షిప్ కు ఎంపికైన పరిధిపేట వాసి 

ఉమెన్ హాకీ నేషనల్ ఛాంపియన్షిప్ కు ఎంపికైన పరిధిపేట వాసి 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
రైల్వే ఆస్ట్రో టార్ఫ్ సికెంద్రాబాద్ హాకీ గ్రౌండ్ లో జరిగిన జూనియర్ ఉమెన్స్ నేషనల్ క్యాంప్ లో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధి పేట గ్రామానికి చెందిన తగిరంచ శ్రావ్య ఉత్తమ ప్రతిభ కనబరిచింది. 1.08.2025 నుండి 12.08.2025 వరకు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జరగబోయే జూనియర్ ఉమెన్ హాకీ నేషనల్ ఛాంపియన్షిప్ కి శ్రావ్య సెలెక్ట్ కావడం జరిగిందనీ కామారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు నీలం లింగం తెలిపారు.  కామారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ కోశాధికారి  మధుసూదన్ రెడ్డి, హాకీ కోచ్ ఆంజనేయులు, క్రీడాకారులు, గ్రామస్తులు వారికి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -