- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శనివారం వాకింగ్‌కు వెళ్తున్న క్రమంలో కుక్కల దాడిలో విశ్రాంతి తపాలా ఉద్యోగి శ్రీనివాసరావుకి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో శ్రీరామ ఆర్థోపెడిక్ ప్రముఖ వైద్యులు డాక్టర్ పటేల్ నిర్ధారించి ఆయన సుమారుగా మూడు మాసాలు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడత విపరీతంగా ఉందన్నారు. దీంతో ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి,తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -