రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్‌ను జీ5 తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో గురువారం మేకర్స్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ, ‘ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందరి ఎఫర్ట్‌తోనే ఇదంతా సాధ్యమైంది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ టైంలో శ్రీరామ్‌కి నేను ఎందుకు గుర్తు రాలేదో నాకు తెలీదు. కానీ ఈ ప్రసాద్ రావు పాత్రను ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు నుంచీ శ్రీరామ్ ఈ సిరీస్ విజయం పట్ల నమ్మకంగా ఉండేవారు. రెబెకా పాత్రలో ఉదయ భాను ఎలా ఉంటారో అని అనుకున్నాను. కానీ ఆమె ఎంతో డైనమిక్‌గా, పవర్ ఫుల్‌గా అనిపించారు. సిరీస్ చూసిన వారంతా కూడా కృష్ణ రాసిన కథ, తీసిన విధానం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు’ అని తెలిపారు.
‘ఈ సిరీస్‌ని ప్రతీ ఒక్కరూ చూడాలి. ప్రస్తుత తరంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను చూపేలా మా దర్శకుడు కృష్ణ మంచి కథను తీసుకు వచ్చారు. జీ, కృష్ణ, నేను కలిస్తేనే ఈ సక్సెస్ వచ్చింది. ఈ విజయంలో అందరి పాత్ర ఉంది. ఇందులోని ప్రతీ పాత్రకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను. అను మేడం నాకు ఈ కెరీర్‌ను ఇచ్చారు. ఆమె గురించి ఒకనాడు నేను కచ్చితంగా మాట్లాడతాను. మా సిరీస్‌ను చూసి ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని నిర్మాత శ్రీరామ్ వెంకట్ చెప్పారు. దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ,’మా సిరీస్‌ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్‌కి థ్యాంక్స్’ అని తెలిపారు. జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ మాట్లాడుతూ, ‘ఈ సిరీస్ చాలా ఏళ్ళ వరకు కనిపిస్తుంది. జీ5 తెలుగులో చాలా ఏళ్లు నిలబడుతుంది’ అని అన్నారు.
ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



