Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిరి స్వచ్ఛంద సంస్థతో మహిళలకు చేయూత

సిరి స్వచ్ఛంద సంస్థతో మహిళలకు చేయూత

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
సిరి స్వచ్ఛత సంస్థతో గ్రామీణ ప్రాంత మహిళలకు చేయూతనందిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పరికి సుధాకర్ ఉపోద్ఘాటించారు. మండలంలోని ఉకల్ గ్రామంలో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కొండాపురం కెనరా బ్యాంక్ లో మహిళలకు రుణాలు ఇప్పియ్యడం జరుగుతుందని తెలిపారు. మహిళలు స్వఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి సిరి స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు తోడ్పడుతుందన్నారు. శిక్షణ శిబిరం ఏర్పాటుకు సహకరించిన రాజేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ సుధారాణి, జయక్క, రితిక, సుమలత, మమత, అశ్విని తదితర పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -