Thursday, June 5, 2025
E-PAPER
Homeసినిమాఆ నమ్మకాన్ని కలిగించే సిరీస్‌

ఆ నమ్మకాన్ని కలిగించే సిరీస్‌

- Advertisement -

జియో హాట్‌స్టార్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ నుంచి జియో హాట్‌ స్టార్‌గా పున:నిర్మితమై ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. హాట్‌స్టార్‌ స్పెషల్స్‌లో భాగంగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘దేవిక అండ్‌ డానీ’ అనే వెబ్‌ సిరీస్‌ను ఈనెల 6 నుంచి అందించనుంది. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్‌, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్‌, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బి.కిషోర్‌ దర్శకత్వంలో సుధాకర్‌ చాగంటి నిర్మించారు. ఈ సిరీస్‌ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న సందర్భంగా హీరోయిన్‌ రీతూవర్మ మాట్లాడుతూ, ‘ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ కాన్సెప్ట్‌ వస్తే వెబ్‌ సిరీస్‌ చేద్దామనుకున్నాను. ఆ సమయంలో ‘దేవిక అండ్‌ డానీ’ వంటి నిజాయితీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది. ఇలాంటి ఓ కథను నమ్మి ప్రొడ్యూస్‌ చేసిన మా సుధాకర్‌కి థ్యాంక్స్‌. డైరెక్టర్‌ కిషోర్‌ చాలా ఫోకస్‌గా ఉంటారు. చాలా మంది అమ్మాయిలకు చుట్టు పక్కల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయలేవు అని చెప్పి డిస్కరేజ్‌ చేస్తుంటారు. కానీ అలాంటి వారికి ఈ సిరీస్‌ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది’ అని తెలిపారు.
‘సాధారణంగా ఊర్లలో ఉండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి. ఈ పని చేయాలని, ఆ పని చేయకూడదని అంటుంటారు. అలాంటివాళ్లు బయటకు వెళితే ఎలా మారుతారనే ఓ విషయాన్ని చక్కగా ఇందులో చూపించారు. తప్పకుండా ఈ సిరీస్‌ అందరికీ నచ్చుతుంది. నేను పోషించిన డానీ పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. ఆడియెన్స్‌కు అన్నీ పాత్రలు చక్కగా కనెక్ట్‌ అవుతాయి’ అని సూర్యవశిష్ట్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -