ఓ అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్ రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కష్ణ బుర్రా రూపొందించారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ నేటి (శుక్రవారం) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మెగా ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరీస్‌లోని మొదటి నాలుగు ఎపిసోడ్‌లను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం మధుర శ్రీధర్ మాట్లాడుతూ, ‘ఇలాంటి కథలను ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి జీ5 టీం చాలా కష్టపడుతోంది. అనిల్, వర్షిణి అద్భుతంగా నటించారు. చరణ్ అర్జున్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో మంచి మ్యూజిక్, పాటలు, ఆర్‌ఆర్ ఇచ్చారు. శ్రీకాంత్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి’ అని అన్నారు.
‘మేం ముందుగా ఈ సిరీస్‌ను సొంతంగా చేయాలని అనుకున్నాం. ఆ టైంలో మధుర శ్రీధర్ మాకు సపోర్ట్ ఇచ్చారు. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. జీ5 టీం సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇక పై మై విలేష్ షో టీం నుంచి ప్రపంచ స్థాయి చిత్రాలు వస్తాయి’ అని మరో నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ చెప్పారు.
ఆద్యంతం నవ్వించే సిరీస్
- Advertisement -
- Advertisement -