- Advertisement -
నవతెలంగాణ సూర్యాపేట: సూర్యాపేటజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుంగతుర్తి మండలం బండరామారం వద్ద ఓ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన వేముల నాగరాజు(26), వేముల కార్తీక్(24)గా పోలీసులు గుర్తించారు. కాగా వేముల నాగరాజు హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్టు తెలిసింది.
- Advertisement -