శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేసిన కిరాణా వర్తక సంఘం సభ్యులు
నవతెలంగాణ – కాటారం
భూపాలపల్లి జిల్లా కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నూతనంగా నియమితులైన కాటారం మాజీ ఎంపీపీ పంతకాని తిరుమల-సమ్మయ్య లను సోమవారం రోజున ఉదయం ఆదర్శ నగర్ లోని వారి స్వగృహంలో కాటారం మండల కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం సభ్యులు పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వర్తక సంఘం అధ్యక్షుడు కలికోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముందుగా మార్కెట్ చైర్ పర్సన్ పంతకాని తిరుమల-సమ్మయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ వీరు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
కాటారం లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని,గోదాం లను,ముక్యంగా వ్యవసాయ మార్కెట్ కు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని,వ్యవసాయ మార్కెట్ ఇంకా అభివృద్ధి పథంలో నడవడానికి కృషి చేయాలని కోరాడు.కాటారం డివిజన్ లోని ఐదు మండలాల రైతులకు ఉపయోగపడే విధంగా కాటారంలో కోల్డ్ స్టోరేజ్ ప్యాక్టీరీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ కు విన్నవించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు కలికోట శ్రీనివాస్ తో పాటుగా ప్రధాన కార్యదర్శి రత్న రవి,వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు గంగిరెడ్డి లచ్చిరెడ్డి,ఉపాధ్యక్షుడు కట్ల రాజయ్య,వర్తక సంఘం సబ్యులు బీరెల్లి రమేష్,శాన్వి సూపర్ మార్కెట్ రాజు,వంశీ,అల్లాడి ఓం ప్రకాష్,అల్లాడి కిరణ్ కుమార్,రమేష్,దారం నంద కిషోర్,బాసాని రవి,ఎస్ మార్ట్ రవి,చిట్టూరీ శ్రీనివాస్,ముక్క శ్రీనివాస్,ఉప్పల గోవర్ధన్,దారం నగేష్ కుమార్,సంతోషం ప్రవీణ్ రెడ్డి,శెనిగరం మల్లారెడ్డి,చీర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కు చిరు సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES