హీరో కార్తి నటిస్తున్న కొత్త చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. శనివారం డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ కంప్లీట్ ఎంగేజింగ్‌గా ఉందని, థియేటర్స్‌లో సినిమా చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని ఆయన అప్రిషియేట్ చేస్తూ, ‘అన్నగారు వస్తారు’ సినిమా టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న సరదా అయిన పోలీస్ ఆఫీసర్ కార్తి. ఆయనకు బాల్యం నుంచే సినిమాతో అనుబంధం ఏర్పడుతుంది.
పోలీస్ డిపార్ట్‌మెంట్ పట్ల ప్రజల్లో మర్యాద పెరగాలని సఫారీతో యూనిఫామ్ కుట్టించుకుంటాడు. హీరోయిన్‌ను కలిసినప్పుడు జాలీ టు మీట్ యూ అని రొమాంటిక్‌గా పలకరిస్తాడు. మరోవైపు చేతివాటం చూపిస్తుంటాడు. అయితే సమాజానికి ఒక రియల్ హీరో అవసరమైనప్పుడు అన్నగారిలా అరంగేట్రం చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ కార్తి, అన్నగారులా ఎలా వచ్చారు?, సొసైటీ కోసం ఏం చేశారు అనేది ట్రైలర్‌లో ఆసక్తి కలిగించింది. కార్తి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. ఈ కమర్షియల్ హంగులకు తోడు అన్నగారి గెటప్ అదనపు ఆకర్షణగా నిలిచింది. థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉండబోతున్నట్లు ట్రైలర్ చెప్ప కనే చెప్పింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్, మ్యూజిక్ – సంతోష్ నారాయణన్.
పక్కా యాక్షన్ కామెడీ సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



