Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

రాజు జయమోహన్‌, ఆధ్య ప్రసాద్‌, భవ్య త్రిఖ హీరో, హీరోయిన్లుగా రాఘవ్‌ మిర్‌దత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బన్‌ బటర్‌ జామ్‌’. సురేష్‌ సుబ్రమణి యన్‌ సమర్ప కుడిగా రెయిన్‌ ఆఫ్‌ ఎరోస్‌, సురేష్‌ సుబ్రమణియన్‌ నిర్మించిన ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తమిళంలో సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఈనెల 22న శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ పై సిహెచ్‌ సతీష్‌ కుమార్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. కాలేజ్‌ లైఫ్‌, ప్రేమ, పెళ్లి, తల్లిదండ్రుల ప్రేమ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతోంది. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది యూత్‌ ఫుల్‌, లవ్‌, ఫ్యామిలీ, రొమాంటిక్‌, కామెడీ సినిమా అని వేరే చెప్పక్కర్లేదు. రాఘవ్‌ మిర్‌దత్‌ ఫన్నీగా సినిమాను తెరకెక్కించిన తీరు, నివాస్‌ కె.ప్రసన్న సంగీతం, బాబు కుమార్‌ సినిమాటోగ్రఫీ ఆసక్తిని పెంచుతోంది. ఈనెల 22న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది అని సి.హెచ్‌.సతీష్‌ కుమార్‌ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img