Saturday, November 29, 2025
E-PAPER
Homeబీజినెస్'హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్' ద్వారా క్యాన్సర్ సంరక్షణలో ముందడుగు

‘హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్’ ద్వారా క్యాన్సర్ సంరక్షణలో ముందడుగు

- Advertisement -
  • 1,070 క్యాన్సర్ కణజాల నమూనాల సేకరణ, 10,000 పైగా స్క్రీనింగ్‌లు
  • భారతదేశంలో పిల్లల క్యాన్సర్ (పీడియాట్రిక్) సంరక్షణలో మార్పు కోసం ఐఐటి మద్రాస్ సహకారంతో 2025 సెప్టెంబర్‌లో ‘హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్’ కార్యక్రమాన్ని హెచ్ఎంఐఎఫ్  (HMIF) ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్-యాక్సెస్ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ – ‘భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్’ (BCGA)ను ఐఐటి మద్రాస్‌లో హెచ్ఎంఐఎఫ్ ప్రారంభించింది. ఈ సేవ కోసం హెచ్ఎంఐఎఫ్ రూ. 56 కోట్ల సామాజిక ప్రయోజన పెట్టుబడికి నిబద్ధత ప్రకటించింది. 4 ఏళ్లలో తమిళనాడు, హర్యానా, మహారాష్ట్రలలో 225కు పైగా క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
  • నవతెలంగాణ – గురుగ్రామ్: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) సిఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ (HMIF)… క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి మద్రాస్) సహకారంతో అభివృద్ధి చేసిన తమ ప్రతిష్టాత్మక ‘హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్’ కార్యక్రమం ద్వారా ఈ సేవలను అందిస్తోంది. 2025 సెప్టెంబర్‌లో ప్రారంభమైనప్పటి నుండి, ఈ కార్యక్రమం క్యాన్సర్ పరిశోధన, నివారణ, అవగాహన రంగాలలో గుర్తించదగిన పురోగతిని సాధిస్తూ, వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.

ఈ కార్యక్రమంలో అత్యంత కీలకమైనది ఐఐటి మద్రాస్‌లోని ‘హ్యుందాయ్ సెంటర్ ఫర్ క్యాన్సర్ జీనోమిక్స్’. భారతదేశపు మొట్టమొదటి కమ్యూనిటీ-ఆధారిత ‘క్యాన్సర్ టిష్యూ బయోబ్యాంక్’కు, కొత్తగా ప్రారంభించబడిన ‘భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్’ (బిసిజిఏ)కు ఇది నిలయంగా ఉంది. ఈ బిసిజిఏ, దేశంలోనే మొట్టమొదటి ఓపెన్-యాక్సెస్ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్. ఇది బయోమార్కర్ ఆవిష్కరణను, జనాభా-నిర్దిష్ట చికిత్సలను వేగవంతం చేస్తుంది. ఈ కార్యక్రమం కోసం హెచ్ఎంఐఎఫ్ రూ. 56 కోట్లను సామాజిక ప్రయోజన పెట్టుబడిగా కేటాయించడం, భారతదేశంలో క్యాన్సర్ సంరక్షణను మార్చే లక్ష్యంతో నూతన ఆవిష్కరణలను, విప్లవాత్మక పరిశోధనలను ప్రోత్సహించడం పట్ల సంస్థకు ఉన్న అంకితభావాన్ని నొక్కి చెబుతోంది.

భారతదేశంలో క్యాన్సర్ సంరక్షణను మార్చాలన్న హెచ్ఎంఐఎఫ్ సంకల్పాన్ని వివరిస్తూ, హెచ్ఎంఐఎల్, ఏవిపి & వెర్టికల్ హెడ్ – కార్పొరేట్ అఫైర్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్ & సోషల్, శ్రీ పునీత్ ఆనంద్ మాట్లాడుతూ, “సాంకేతికత, కరుణ, సహకారం… ఈ మూడు క్యాన్సర్ సంరక్షణలో పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలవన్న మా దృఢ విశ్వాసానికి ‘హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్’ కార్యక్రమం ప్రతిబింబం. ఈ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నాడు, ప్రతి పౌరుడికి సకాలంలో, వ్యక్తిగతీకరించిన, గౌరవప్రదమైన క్యాన్సర్ సంరక్షణ లభించే భవిష్యత్తును నిర్మించే దిశగా మా ప్రయత్నాలను పునరుద్ధరిస్తున్నాము. ప్రత్యేకంగా రూ. 3 కోట్ల ‘క్యాన్సర్ కేర్ ఫండ్’తో సహా, మొత్తం రూ. 56 కోట్ల నిబద్ధతతో , హెచ్ఎంఐఎఫ్… వ్యాధిని ముందుగా గుర్తించడం, పరిశోధన, చికిత్స, సామాజిక అవగాహన వంటి అంశాలలో సమానమైన అవకాశాలను కల్పించేందుకు పనిచేస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే 10,000 మందికి పైగా జీవితాలను తాకాయి.”

‘హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్’: సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళు

సామాజిక సేవ & స్క్రీనింగ్ :
తమిళనాడు వ్యాప్తంగా 103 క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించగా, 10,008 మందికి సేవలు అందాయి.
తమిళనాడు వ్యాప్తంగా 103 క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించగా, 10,008 మందికి సేవలు అందాయి.
నోటి (oral), గర్భాశయ (cervical), పెద్దప్రేగు (colon), రొమ్ము (breast), ప్రోస్టేట్ క్యాన్సర్‌ల కోసం ముందస్తు గుర్తింపు స్క్రీనింగ్‌లు జరిగాయి.
380 మందికి పైగా వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది, వారిని అధునాతన సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేశారు.

క్యాన్సర్ టిష్యూ బయోబ్యాంక్ & జీనోమిక్ సీక్వెన్సింగ్

  • 1,070 క్యాన్సర్ కణజాల నమూనాలను సేకరించారు, 528 పీడియాట్రిక్ లుకేమియా (పిల్లల రక్త క్యాన్సర్) కేసులకు పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పూర్తి చేశారు.
  • వ్యాధిని ముందుగా గుర్తించడం, ట్రాక్ చేయడం కోసం భారతదేశ-నిర్దిష్ట బయోమార్కర్ జీన్ ప్యానెళ్లను గుర్తించడానికి జీనోమిక్ విశ్లేషణ కొనసాగుతోంది.
  • భారతదేశపు మొట్టమొదటి ఓపెన్-యాక్సెస్ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ ‘భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్’ (బిసిజిఏ)ను ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.

హెచ్‌పివి వ్యాక్సినేషన్ డ్రైవ్: తమిళనాడులోని అరియలూర్, విరుదునగర్, సేలంలలో కార్కినోస్ హెల్త్‌కేర్, క్యాన్సర్ రీసెర్చ్ అండ్ రిలీఫ్ ట్రస్ట్ (సిఆర్‌ఆర్‌టి) సహకారంతో 525 మంది బాలికలకు హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను అందించారు.

రాబోయే కార్యక్రమాలు : దేశవ్యాప్తంగా ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని పేద పిల్లలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించనున్నారు. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి, జీనోమిక్ సీక్వెన్సింగ్, మాలిక్యులర్ ఆంకాలజీలో 100+ మంది ల్యాబ్ నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి (upskill) టెక్నీషియన్ శిక్షణా కార్యక్రమం. పూర్తి సదుపాయాలు గల ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ఇప్పటికే తమిళనాడులోని 17 జిల్లాలకు చేరుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర, హర్యానాలకు విస్తరించాలని ప్రణాళిక. రాబోయే నాలుగేళ్లలో, తమిళనాడు, హర్యానా, మహారాష్ట్రలలో మొత్తం 225+ క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించి, 1.27 లక్షల మందిని చేరుకోవాలని, 5,000+ మంది బాలికలకు హెచ్‌పివి వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జారీ చేసినవారు: 

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ 

ప్లాట్ నెం. H-1, సిప్కాట్ ఇండస్ట్రియల్ పార్క్ 

ఇరుంగట్టుకోట్టై, శ్రీపెరంబుదూర్ తాలూకా 

కాంచీపురం జిల్లా, తమిళనాడు – 602 117.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -