Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమౌలిక వసతుల అభివృద్ధికి ముందడుగు

మౌలిక వసతుల అభివృద్ధికి ముందడుగు

- Advertisement -

‘సంపంగి’ ఆధ్వర్యంలో పాఠశాలలు, గ్రామాల దత్తత అభినందనీయం
గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అవసరం : నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి


నవతెలంగాణ – హైదరాబాద్‌
నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో సంపంగి గ్రూప్‌ (టీటీఏ) ఆధ్వర్యంలో సంపంగి చారిటబుల్‌ ట్రస్ట్‌ పాఠశాలలు, గ్రామాల దత్తత కార్యక్రమం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. దత్తత కార్యక్రమంలో భాగంగా 30 పాఠశాలలతో పాటు రెండు గ్రామాలను ట్రస్ట్‌ దత్తత తీసుకున్నారు. ప్రతి పాఠశాలకు అవసరమైన కంప్యూటర్లు, గ్రామాలకు ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంగ్టి మండలం పోటీపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలంటే కంప్యూటర్‌ విద్య అత్యంత అవసరమన్నారు.

అలాగే, ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందాలనే లక్ష్యంతో వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని, భవిష్యత్‌లో విద్యార్థుల విద్యాభివృద్ధికి, గ్రామాల సమగ్రాభివృద్ధికి సంపంగి గ్రూప్‌ నిరంతరం తోడుంటుందని చైర్మెన్‌ రమేష్‌ సంపంగి, సీఈఓ సురేష్‌ సంపంగి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీఏ గ్రూప్‌ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -