Wednesday, October 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆటోను ఢీకొట్టిన తుఫాన్ వాహనం..పలువురికి గాయాలు

ఆటోను ఢీకొట్టిన తుఫాన్ వాహనం..పలువురికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి: మండల కేంద్రం శివారులోని గాంధీనగర్ సమీపంలో నాగాపూర్ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అతివేగం వస్తున్న తుఫాన్ వాహనం  ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న  పలువురు గాయాలపాలయ్యారు. మండల కేంద్రానికి చెందిన తహేర్ తన ఆటోలో నాగపూర్ గ్రామం నుండి పలువురు ప్రయాణికులతో కమ్మర్ పల్లికి వస్తుండగా జాతీయ రహదారి నుండి నాగపూర్ వైపు వెళ్లే దారి వద్ద ఆటోను మెట్ పల్లి వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు కిందపడిపోయి గాయపడ్డారు. వీరికి స్వల్పగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తుఫాన్ డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -