”మిరాయ్’ సినిమాని మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఒక ఎక్స్‌ట్రార్డినరీ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేశాం. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు తేజ ‘హనుమాన్’ ఇంకా రాలేదు. మేము కథని నమ్మాం. ఇందులో దాదాపు పది పెద్ద ఎపిసోడ్లు ఉంటాయి. మంచి కథ, మంచి మ్యూజిక్, గ్రేట్ లొకేషన్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది’ అని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు.
హీరో తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈనెల 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మంగళవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
నాకు చిన్నప్పుడు చందమామ కథలు, అమరచిత్ర కథలు అంటే చాలా ఇష్టం. ఆ కథలన్నీ కూడా మన రామాయణ, మహాభారత ఇతిహాసాలకి కనెక్ట్‌గా ఉంటాయి. ‘మిరాయ్’ కూడా అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్. చరిత్రతో పాటు ఫిక్షన్ కూడా బ్లెండ్ అయి ఉంది. దర్శకుడు కార్తీక్ కథ చెప్పగానే చాలా నచ్చింది.
అశోకుడు మొత్తం జ్ఞానాన్ని 9 పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడు. అందులో వాటి రక్షణ ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఒక పుస్తకం మాత్రం ఒక ఆశ్రమానికి ఇస్తాడు. ఆ పుస్తకాల ప్రాధాన్యత ఏమిటి? వాటి గురించి హీరో, విలన్ ఎలాంటి పోరాటం చేశారనేది అద్భుతంగా ఉంటుంది. అన్నింటికి మించి ‘మిరాయి’ ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ, ఆ సంకల్పం ఏంటి ఆనేది తెరపై అద్భుతంగా వచ్చింది.
తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్షన్ కోసం థాయిలాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అలాగే మనోజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. చాలా అనుభవం ఉన్న నటీనటులు ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు.
కరణ్ జోహార్ సినిమా కంటెంట్‌ని చూశారు. వాళ్లకు చాలా నచ్చింది. ఆయన నార్త్‌లో రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్లోకతో కలసి యూఎస్‌లో రిలీజ్ చేస్తున్నాము. కర్ణాటకలో హౌంబాలే, కేరళలో గోకులం తమిళనాడులో ఏ జి ఎస్ రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అన్ని చోట్లా పెద్ద పెద్ద సంస్థలు మా చిత్రాన్ని భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాయి.
‘ప్రభాస్‌తో చేస్తున్న రాజాసాబ్’ జనవరి 9న వస్తుంది. ‘కాంతార2’తో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. ప్రభాస్ బర్త్ డేకి ఫస్ట్ సింగిల్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం. ”తెలుసు కదా’ నెక్స్ట్ మంత్ వస్తుంది. తర్వాత ‘మోగ్లీ’ ఉంటుంది. లావణ్య త్రిపాఠితో ఒక థ్రిల్లర్ చేస్తున్నాం, సునీల్‌తో కూడా ఒక సినిమా చేస్తున్నాం. అవి కూడా ఈ ఏడాదిలోనే వస్తాయి. ‘గూడచారి2, గరివిడి లక్ష్మి’, అలాగే కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాం. దాదాపు 12 సినిమాలు 2026-2027 టైమ్‌లో మా సంస్థ నుంచి విడుదలవుతాయి. నేను 2017లో ఇండిస్టీలోకి వచ్చాను. 2018 నుంచి మాసినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి ఏడాది మాకు మంచి సక్సెస్‌లు ఉంటాయి. కానీ 2024 డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ‘మిరాయ్’తో కంబ్యాక్ ఇస్తామని పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్