Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeసినిమామూడు యుగాల నేపథ్యంలో సాగే కథ

మూడు యుగాల నేపథ్యంలో సాగే కథ

- Advertisement -

దర్శకుడు పూర్వాజ్‌ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్‌ పీస్‌’. అరవింద్‌ కష్ణ, జ్యోతి పూర్వజ్‌, మనీష్‌ గిలాడ, అషు రెడ్డి లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ కండ్రేగుల, మనీష్‌ గిలాడ, ప్రజరు కామత్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్‌ సీన్స్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కవరేజ్‌ కోసం మేకర్స్‌ సోమవారం మీడియాను ఆహ్వానించారు.
దర్శకుడు పూర్వాజ్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్ర కథను మన పురాణ, ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారు చేశాను. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్‌ హీరో క్యారెక్టర్‌ను, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్‌ విలన్‌ పాత్రను క్రియేట్‌ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్‌ను ఇందులో చూస్తారు. ఈ కథలో శివుడి నేపథ్యం ఉంటుంది. కాబట్టి మేము అనుకున్న వర్క్స్‌ అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం’ అని అన్నారు.
‘మలయాళంలో ‘మిన్నల్‌ మురళీ’ సినిమా వచ్చాక అలాంటి ఒక సూపర్‌ హీరో చిత్రాన్ని మనం తెలుగులో ఎందుకు చేయకూడదు అని ఈ సినిమాని మొదలుపెట్టాం. హాలీవుడ్‌లో కూడా ఉపయోగించని టెక్నాలజీని మా సినిమాకు వాడుతున్నాం’ అని పొడ్యూసర్‌ శ్రీకాంత్‌ కండ్రేగుల చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ యోగి పోసాని, హీరో అరవింద్‌ కష్ణ, సూపర్‌ విలన్‌, ప్రొడ్యూసర్‌ మనీష్‌ గిలాడ, హీరోయిన్‌ జ్యోతి పూర్వాజ్‌ తదితరులు ఈ చిత్ర విశేషాలతోపాటు తాము పోషించిన పాత్రల గురించి తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad