భారతీయ కిసాన్ సంగ్.. నాగిరెడ్డిపేట శాఖ..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మంజీరా నది పరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలను సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ సంగ్ నాగిరెడ్డిపేట్ శాఖ డిమాండ్ చేసింది. గురువారం మండల కేంద్రంలో గల తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ రాజేశ్వర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన సంబంధిత రైతుల వద్ద నుండి వివరాలు సేకరించి నష్టపరిహారం అందే విధంగా చేయాలి కానీ రైతులందరి వద్ద నుండి జిరాక్స్లు తీసుకొని ఉన్నతాధికారులకు పంపడం వల్ల ఎవరికి న్యాయం జరగడం లేదని తెలిపారు. నష్టపోయిన అసలు రైతుల వివరాలను మాత్రమే ఉన్నత అధికారులకు నివేదికలు పంపించి నష్టపరిహారం అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జివి రావు, వెంకట్ రెడ్డి, రాజారెడ్డి, నరేందర్ రెడ్డి, నారాయణ, సుభాన్ రెడ్డి, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.
పంట పోలాల సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES