- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కోరుట్ల -మెట్ పల్లి జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోరుట్లకు చెందిన ఏడుగురు యువకులు మారుతీ నగర్ దాబా వద్ద ‘టీ’ తాగడానికి స్విఫ్ట్ డిజైర్ కారులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను జగిత్యాల, కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -