– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ టీవీ యాంకర్, అభ్యుదయవాది, రచయిత్రి, మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆమె మరణవార్త తెలియగానే శనివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్ద జాన్‌వెస్లీతోపాటు ఆపార్టీ రాష్ట్ర నాయకులు డిజి నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు, జె బాబురావు, నాయకులు కోట రమేష్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఆమె భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఆమె అనుమానాస్పదంగా మరణించినట్టు తెలుస్తున్నదనీ, కుటుంబ సమస్యలు కూడా ఉన్నట్టున్నా యని అన్నారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్న స్వేచ్ఛ పిరికితనంతో ఆత్మహత్య చేసుకునే అవకాశం లేనట్టు కనిపిస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె మరణం పట్ల అనేక ఆరోపణలు వస్తున్నాయని వివరించారు. స్వేచ్ఛ మరణంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
స్వేచ్ఛ మరణంపై సమగ్ర విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -



