Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బల్మూరులో త్రిముఖ పోటీ తప్పేలా లేదు..

బల్మూరులో త్రిముఖ పోటీ తప్పేలా లేదు..

- Advertisement -

– రిజర్వాయర్ వ్యతిరేక వర్గం 
– కాంగ్రెసులో రెండు వర్గాలు 
– గెలుపు మాదంటే.. మాది
నవతెలంగాణ – బల్మూరు 

మండల కేంద్రం బల్మూరులో గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి ఎస్టి మహిళకు రిజర్వు కావడంతో.. అభ్యర్థి ఎంపికకు గత వారం రోజులుగా ఆయా పార్టీల నాయకులు కసరత్తు నిర్వహించారు. ఎట్టకేలకు నామినేషన్ల మొదటి రోజు అయిన బుధవారం తమతమ అభ్యర్థులను ప్రకటించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కావలసిన సర్టిఫికెట్లు బ్యాంకు ఎకౌంటు నామినేషన్ పత్రంలోని రూల్స్ సమకూర్చుకునే పనిలో బిజీ అయిపోయారు. సిపిఐ (ఎం) బి ఆర్ ఎస్, బిజెపి వారు ఏ పార్టీకి చెందకుండా రిజర్వాయర్ వ్యతిరేక కమిటీ అనకుండా గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో ఉమ్మడిగా సర్పంచ్ స్థానానికి పోటీ చేయక తప్పడం లేదని ఆయా పార్టీల నాయకులు చెప్పుకొచ్చారు. 

మండల కేంద్రం సమీపాన నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ ను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చేస్తున్నారు. గ్రామ పంచాయితీ సర్పంచ్ స్థాయిలో రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకించాలని అందుకు తమ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించుకోవాలని ఒక్కటైనట్లు తెలుపుతున్నారు. రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్నవారే ఓట్లేసుకోవాలని ఇతరులను పట్టించుకోరా అని మరికొందరు వ్యతిరేక విమర్శలు చేస్తు మాట్లాడుకోవడం వినిపించింది.

 స్థానిక కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి ఒకే పార్టీలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులను బరిలోకి దించనున్నారు. వీరి విషయమై ఇరు వర్గాల మధ్యన సయోధ్య కుదిరిచ్చేందుకు అచ్చంపేట నియోజకవర్గ స్థాయి లీడర్లు నచ్చ చెప్పినప్పటికీ వీరి వైఖరి మారలేదని చర్చించుకుంటున్నారు. మా వర్గమే గెలుస్తుందని ఒక వర్గం కాంగ్రెస్ వారు ధీమా వ్యక్తం చేస్తుండగా మా వర్గమే గెలుస్తుందని మరో కాంగ్రెస్ వర్గం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రిజర్వాయర్ వ్యతిరేక కమిటీ కూడా మా వర్గమే గెలుస్తుందని గెలుపు మాదే అంటే మాదేనని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -