Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డుపై అడ్డంగా వృక్షం... పట్టించుకున్న నాథుడే లేడు

రోడ్డుపై అడ్డంగా వృక్షం… పట్టించుకున్న నాథుడే లేడు

- Advertisement -

– రోజు గడిచిన ఏమి పట్టని అధికారులు 
– రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రం నుండి ఉప్లూర్ వెళ్లే దారిలో ఆదివారం మధ్యాహ్నం ఓ భారీ వృక్షం నేల కూలింది. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి బాగా తడిసి వేర్లతో సహా చెట్టు రోడ్డుకు అడ్డంగా నేల కూలింది.దీంతో డబుల్ రోడ్డు కాస్త సింగిల్ రోడ్డు గా మారింది. చెట్టు విరిగిపడి రోజు గడిచిపోయిన రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్టును తొలగించాలనే ఆలోచన ఎవరికి లేకుండా పోయింది. ఈ రోడ్డు గుండా వెళ్తున్న వాహనదారులు కూడా ఒకే పక్కగా ఇరువైపుల రాకపోకలు సాగిస్తున్నారే తప్ప అడ్డంగా పడ్డ చెట్టును పక్కకు జరుపుదామనే ఆలోచన చేయడం లేదు. భారీ వృక్షం నేలకూలిన ప్రదేశం ఇటు కమ్మర్ పల్లి, అటు ఉప్లూర్ గ్రామాల సరిహద్దు కావడంతో ఇరు గ్రామాల  గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా స్పందించడం లేదు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అనుకోని ఏదైనా ప్రమాదం జరుగుతే తప్ప రోడ్డుపై అడ్డంగా పడ్డ చెట్టును కదిలించే పరిస్థితి కనిపించడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -