జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్రిష ప్రెజెంటర్‌గా సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రీతీ జంఘియానీ రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. జె.డి చక్రవర్ మాట్లాడుతూ,’ నిర్మాత శివ చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. దీని పోస్ట్ ప్రొడక్షన్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముంబయిలో చేస్తున్నారు. సీరత్ మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్, సింగర్. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. నరేష్ అద్భుతంగా నటించాడు. డైరెక్టర్ శ్రవణ్ సినిమాని చాలా బాగా తీశాడు. ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్‌ని సజెస్ట్ చేసింది నేనే. మలయాళం నుంచి వచ్చే సినిమాలు బావుంటాయంటాం. ఈ సినిమా కూడా ఆ కోవకి చెందిన సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. ‘చాలా ఇంటెన్స్‌గా రాసిన స్క్రిప్ట్ ఇది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అద్భుతంగా ఉంటుంది. జేడీ చక్రవర్తి స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ప్రతి అడుగులో సపోర్ట్ చేశారు. నరేష్ అగస్త్య, సీరత్ కపూర్, నిర్మాత శివకుమార్ మంచి సహకారం అందించారు’ అని డైరెక్టర్ శ్రవణ్ చెప్పారు. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ, ‘మంచి కంటెంట్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ట్విస్టులు చాలా బాగుంటాయి’ అని అన్నారు. ‘నాకు ఈ సినిమా చాలా స్పెషల్. ఇది చాలా యూనిక్ సినిమా’ అని నాయిక సీరత్ కపూర్ తెలిపారు.
కొత్త డైరెక్టర్ శ్రవణ్ చెప్పిన కాన్సెప్ట్ అద్భుతంగా అనిపించింది. కాన్సెప్ట్‌ని నమ్మి చేసిన సినిమా ఇది. జెడి చక్రవర్తి నాకు మంచి స్నేహితులు. సీరత్ ప్రమోషన్స్‌లో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. నరేష్ చాలా టాలెంటెడ్. డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించి, తనకి భవిష్యత్తులో మరెన్నో మంచి అవకాశాలు వస్తాయి. ‘తమ్ముడు’ హీరోయిన్ ప్రీతీ జంఘియానీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. తన పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పాన్ ఇండియా మూవీ. ఆ రేంజ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం.
– నిర్మాత మల్కాపురం శివ కుమార్
సరికొత్త అనుభూతినిచ్చే యూనిక్ యాక్షన్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -