సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమిస్తున్నా’. వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్‌లో కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నారు. భాను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వేడుకలో సంగీత దర్శకులు భీమ్స్, దర్శకులు అశోక్.జి, అనుదీప్ కె.వి, భాను బోగవరుపు, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేడుకలో ఐబిఎమ్ మెగా మ్యూజిక్ ఆడియో కంపెనీని లాంచ్ చేయటం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాత కనకదుర్గారావు పప్పుల మాట్లాడుతూ,’అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది. కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ, అనంతమైన ప్రేమ ఉంటుంది. ప్రేమలో ఇదివరకు ఎవ్వరూ టచ్ చేయని ఒక డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు భాను. యంగ్ జనరేషన్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే అనేక ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ చిత్రం నుండి ‘అరెరె..’ సాంగ్‌ను భీమ్స్ విడుదల చేయడం సంతోషంగా ఉంది.
సుద్దాల అశోక్ తేజ అద్భుతంగా రాశారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను తనదైన శైలిలో పాడారు. సిద్ధార్థ్ సాలూర్ మంచి సంగీతం అందించారు’ అని తెలిపారు.
‘ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సాత్విక్ వర్మ ఈ సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నారు. అలాగే తెలుగమ్మాయి ప్రీతి నేహా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇద్దరూ పోటీపడి బాగా నటించారు. నిర్మాత కనకదుర్గారావు సినిమాను ప్రేమించే మంచి టేస్ట్ ఉన్న మనిషి. మమ్మల్ని నమ్మి ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళ్లారు. సాలూరి రాజేశ్వరరావు కుటుంబం నుంచి సిద్ధార్థ్ సాలూరి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ కాబోతోంది. సంగీతమే ప్రధానంగా సాగే ఈ ప్రేమకథలో వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ఉంటుంది. ఇలాంటి మంచి లవ్‌స్టోరీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఇది అందరికి కనెక్ట్ అయ్యే సినిమా’ అని దర్శకుడు భాను చెప్పారు.
‘ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఓ వైవిధ్యభరిత ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఇది కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది’ అని హీరో సాత్విక్ వర్మ అన్నారు.