దశలవారిగా ఆందోళన- పోరాటాలు
తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దశలవారిగా ఆందోళనలు- పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ ) శ్రీకారం చుట్టనున్నదని ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు తెలిపారు. తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఫెడరేషన్ అధ్యక్షులు భుక్యా శ్రీనివాస్ అధ్యక్షన శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వంగూరు రాములు మాట్లాడుతూ సీఐటీయూ నేటి 20 నుంచి వచ్చే నెల 18 వరకు సంతకాల సేకరణ, 19న తహశీల్దార్ కార్యాలయాలు, ఫిబ్రవరి 9న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఛలో హైదరాబాద్ నిర్వహించనున్నట్టు తెలిపారు. హమాలీలు వ్యవసాయ మార్కెట్, కూరగాయలు, పండ్ల మార్కెట్, ఎఫ్‌సీఐ, సిమెంట్, గోదాముల్లో సివిల్ సప్లై, జీసీసీి, బేవరేజస్, బజారు ముఠా, ఐకెేపీ, హమాలీలు, గ్రామీణ హమాలీలు, రైస్ మిల్, ఆయిల్ మిల్, రైల్వే, ఆర్టీసీలో పనిచేసే హమాలీందరి సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేసి పేద హమాలీందరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హమాలీలు తమ ఒంటిపై బరువులు మోసి ఎగుమతులు దిగుమతులు చేసి ఈ సమాజానికి అన్ని రకాల సరుకులను అందిస్తూ సమాజాభివృద్ధిలో, పారిశ్రామిక ఉత్పత్తి రంగాల్లో కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు. ఇంత చాకిరి చేసినా వీరికి ప్రభుత్వం నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, ప్రమాద బీమా ఆరోగ్య భీమా వంటి చట్టబద్దహక్కులు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, యు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి యాటల సోమన్న, రాపర్తి రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు బోట్ల చక్రపాణి, ఎం.డి. సలీం, ఎడుకొండలు, వీరయ్య, కె.రవి, జి. నరేష్, కె.జంగయ్య, కె.యాదయ్య, ఎం.శ్రీనివాస్, కె. నాగన్న, ఎన్. మోహన్, డి. పాండు, టి. రాంమూర్తి, పిల్లి రవి, మల్లికార్జున్రావ్ తదితరులు పాల్గొన్నారు.
హమాలీల రక్షణ కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



