ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం
విద్యా సంస్థలకు సెలవుఔ
ఇండ్లలోనే జనాలు
గిరాకీ లేక బోసిపోయిన వ్యాపార సంస్థలు
నవతెలంగాణ – మిర్యాలగూడ
మొంథా తుఫాను ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లా తడిసి ముద్దయింది. మంగళవారం, బుధవారం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. తుఫాను కారణంగా జిల్లాలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించగా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకోలేదు. ఎడతెరపి లేకుండా వర్షం పడడంతో పడటంతో అత్యవసరమైతే తప్పా జనాలు ఇండ్ల నుంచి బయటికి రాలేదు. తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఉన్న దుకాణాలు గిరాకి లేక బోసి పోయాయి. బ్యాంకులో ఖాతాదారు లేక పెట్రోల్ బంకులలో వినియోగదారు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. రెండు రోజులగా జిల్లాలో విస్తారంగా వర్షం పడుతుండడంతో జిల్లా తడిసి ముద్దయింది. ప్రజలు అతలకుతలం అయ్యారు.
తుఫాను కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మురికి కాలువలు, పెద్దపెద్ద డ్రైనేజీలు ముందస్తుగానే శుభ్రం చేశారు. మరో రెండు రోజులపాటు తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అత్యవసరం తప్పా ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి సూచించారు. ఆయా డివిజన్ కేంద్రాలలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో, షెడ్లలో ఉండకూడదని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సూచించారు. అలాంటి ఇండ్లలో నివసించే వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే సమాచారం అందించాలని కోరారు.



