Thursday, January 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకత్తి పట్టుకుని మహిళ హల్‌చల్..

కత్తి పట్టుకుని మహిళ హల్‌చల్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భర్తను చంపుతానంటూ భార్య కత్తి పట్టుకుని నడిరోడ్డుపై హల్‌చల్ చేసిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్, జ్యోత్స్న దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఇంకో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య జ్యోత్స్నకు తెలిసింది. దీంతో భర్తను నడిరోడ్డుపై పట్టుకుని వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పెనుగులాట జరిగింది. దీంతో జ్యోత్స్న, కత్తి తీసుకుని భర్త శ్రీకాంత్‌పై దాడికి యత్నించింది. అది చూసిన అతడు ప్రాణభయంతో ఓ దుకాణంలోకి వెళ్లి దాక్కున్నాడు. అమె అక్కడికి వెళ్లి తలుపు తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. లోపల ఉన్న భర్త డయల్ 100కు సమాచారం అందజేయడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. వారు జ్యోత్స్నకు నచ్చజెప్పి ఆమె చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని సమీప పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -