Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఅద్భుతమైన సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌

అద్భుతమైన సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న మిస్టీరియస్‌ అకల్ట్‌ థ్రిల్లర్‌ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకుడు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో బుధవారం మేకర్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ,’ ఆడియన్స్‌కి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలని ఈ సినిమా చేశాం. మంచి సినిమా వస్తే తప్పకుండా జనం థియేటర్స్‌కి వస్తారు. అది నేను నమ్ముతున్నాను. మా సినిమా కూడా అలాంటి సినిమానే. మా డైరెక్టర్‌ చాలా అద్భుతమైన కథ చేసుకున్నారు. మీకు ఒక ఎడ్జ్‌ ఆఫ్‌ సీట్‌ థ్రిల్లర్‌లాగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫోన్‌ కూడా చూసుకునే టైం ఉండదు. అంతా అంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మా నిర్మాత సాహు ప్యాషన్‌ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఈనెల 12న ఈ సినిమా థియేటర్స్‌లో దద్దరిల్లిపోతుంది. సినిమానే మాట్లాడుతుంది’ అని తెలిపారు.
‘హర్రర్‌ నాకు ఇష్టమైన జోనర్‌. డైరెక్టర్‌ కౌశిక్‌ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది. చాలా డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ఇచ్చిన డైరెక్టర్‌ కౌశిక్‌కి థ్యాంక్యూ. సాయితో చేసిన ‘రాక్షసుడు’ మాకు వెరీ మెమొరబుల్‌ ఫిలిం. మళ్లీ చాలా రోజుల తర్వాత సాయితో ఇలాంటి డిఫరెంట్‌ సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది’ అని హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ చెప్పారు.
డైరెక్టర్‌ కౌశిక్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా మీ అంచనాలకు మించి ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. టెక్నికల్‌గా సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది’ అని అన్నారు.
‘ట్రైలర్‌కి ఆడియన్స్‌ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము ఎలాగైతే ఎగ్జైట్‌ అయ్యామో ఆడియన్స్‌ కూడా అదే రకంగా ఎగ్జైట్‌ అయ్యారు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆడియన్స్‌కి సినిమా నచ్చుతుంది. మా హీరో, హీరోయిన్లతో పాటు టీమ్‌ చాలా కష్టపడింది. వారి కష్టానికి తగిన ఫలితం వస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని ప్రొడ్యూసర్‌ సాహు గారపాటి చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad