Monday, December 8, 2025
E-PAPER
Homeక్రైమ్ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-మరిపెడ
కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు ఈత చెట్టు పైనుంచి పడి గీత కార్మికులు మృతిచెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాయిపాలెంకు చెందిన కల్లు గీత కార్మిక సంఘం గ్రామ అధ్యక్షులు పోగుల సత్యం(63) ఆదివారం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అదనపు ఎస్‌ఐ టి.కోటేశ్వర్‌రావు.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -