Monday, December 8, 2025
E-PAPER
Homeదర్వాజక్షతగాత్ర పసి గానం

క్షతగాత్ర పసి గానం

- Advertisement -

ఎల్లలు లేని బాల్యం
గిరిగీసుకున్న దేశపు గీతల నడుమ
ముడుచుక పోయింది
హద్దులు లేని
పసి హదయ ప్రేమలు
ఏ దారి లేని ఎడారిలో చిక్కుకొన్నయి
ఏ మానవత్వం, ఏ దేశం మహా విధ్వంస రచన
రసం పీల్చే పురుగులా విద్వేషపు దాడులు
వసివాడని పసితనాన్ని
శుష్కింప చేసింది
చిగురులు వేసే తరాన్ని
మోడులా మార్చిన
పొరుగు నేల
గూడేరంలోకి అడుగు పెట్టిన ఒంటెలా
అంగుళమంగుళం కబళించింది
పసిడి రెక్కల మీద ఊరేగాల్సిన పసి మనసులు
మాంసపు ముద్దలుగా మారడం
ఏ భూమి భరించని విలయ విధ్వంసం
శిథిల బాల్యాన్ని
మోస్తున్న నేల
నిత్య సంఘర్షణల రణక్షేత్రంగా మారింది
ముద్దు మాటలతో మురిపించే
తిరిగిరాని బంగరు బాల్యం
యుద్ధ గాయాలను మోస్తున్నది
అమ్మల ఒడిన చిట్టి కథలలో ఊరేగాల్సిన ప్రాయాలు
నిశ్శబ్దంగా క్షతగాత్ర గానాలై విలపిస్తున్నయి

  • బి .వేణుగోపాల్‌ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -