- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం రోటిగూడకి చెందిన సూర అరుణ్ కుమార్ బాక్సింగ్ క్రీడలో సత్తా చాటాడు. నవంబర్ 29 హైదరాబాద్ లోని జేఎన్టీయూలో నిర్వహించిన పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అరుణ్, జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు అతడిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అరుణ్ కుమార్ను ఉత్తమ క్రీడాకారుడిగా తీర్చిదిద్దిన కోచ్ (పీడీ) దేవేందరను ప్రత్యేకంగా అభినందించారు. అరుణ్ కుమార్ మరిన్ని పథకాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామస్తులు అతని ఆశీర్వదించారు.
- Advertisement -



