Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైక్ తో పాటు వరదలో కొట్టుకుపోయిన యువకుడు

బైక్ తో పాటు వరదలో కొట్టుకుపోయిన యువకుడు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం-మహా ముత్తారం మండలాల మధ్యలో గల అంకుసాపూర్ వాగులో శనివారం సాయంత్రం ఓ యువకుడు బైక్ తో పాటు కొట్టుకుపోయాడు. అయితే అతనికి ఈత రావడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఇతను మహాముత్తారం మండలం ములుగుబల్లి గ్రామానికి చెందిన కోర్రెల రాజు అని సమాచారం. శనివారం యువకుడు ఓ పనిపై ములుగు పల్లి గ్రామం నుంచి కాటారం వస్తుండగా మధ్యలో ద్విచక్ర వాహనంపై వాగు దాటే ప్రయత్నంలో వాగు ఉధృతికి ద్విచక్ర వాహనంతో పాటు ఆయన కూడా వాగులో కొట్టుకుపోయాడు.

ఈ క్రమంలో ద్విచక్ర వాహనాన్ని విడిచిపెట్టి రాజు ఈత కొట్టుకుంటూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అక్కడున్నవారు అతన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వాగులపై లో లెవల్ బ్రిడ్జిలు నిర్మించడంతో ప్రతి ఏడాది ఈ సమస్య ఎదురవుతుంది. గతంలో పోతులవాయి వాగు వద్దలో లెవెల్ బ్రిడ్జి ఉండడంతో ఆ గ్రామానికి చెందిన యువకుడు వాగులో కొట్టుకుపోయి చనిపోయాడు. ప్రస్తుతం రాజు సురక్షితంగా బయటపడడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -