Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఐబీఈ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన యువకుడు

ఏఐబీఈ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన యువకుడు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవంగర
ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ లో మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన యువకుడు యాసారపు ప్రవీణ్ ఉత్తీర్ణత సాధించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతనంగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వారు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలంటే ఏఐబిఈ పరీక్ష ఉత్తీర్ణులవటం తప్పనిసరి అన్నారు. అందుకోసం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రెండు సార్లు ఏఐబిఈ పరీక్ష నిర్వహిస్తారన్నారని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయడమే తన లక్ష్యం అన్నారు. గ్రామ వాసి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించడం పట్ల పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -