Monday, December 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలురష్యా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న యువతి

రష్యా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న యువతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈరోజుల్లో ఓటు హ‌క్కును చుల‌క‌న‌గా చూసే యువ‌త‌కు ఓ యువ‌తి ఆద‌ర్శంగా నిలిచింది. ఓట్ల నాడు సెల‌వులు ఇస్తే..ఇంట్లోనే ఉంటూ టైం పాస్ చేసే జ‌నాల‌కు ఆ యువ‌తి స్పూర్తిదాయ‌కంగా నిలిచింది. తెలంగాణలో రెండో విడత ఎన్నికల పోలింగ్‌లో ఓ యువ‌తి ఏకంగా ర‌ష్యా నుంచి ఓటు హ‌క్కును వినియోగించుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబుద గ్రామానికి చెందిన మానస అనే యువతి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించింది. రష్యాలో ఎంబీబీఎస్ చదువుతున్న మానస, సెలవులకు స్వగ్రామానికి వచ్చి ఓటు వేశారు. యువత తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరగా, ఆమె నిబద్ధతను గ్రామస్తులు ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -