Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆకాశ్‌ ప్రైమ్‌ ప్రయోగం విజయవంతం

ఆకాశ్‌ ప్రైమ్‌ ప్రయోగం విజయవంతం

- Advertisement -

దేశీయంగా అభివృద్ధి చేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
న్యూఢిల్లీ :
దేశీయంగా అభివృద్ధి చేసిన వైమానిక రక్షణ వ్యవస్థ ‘ఆకాశ్‌ ప్రైమ్‌’ని భారత సైన్యం లద్దాక్‌లో విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) సీనియర్‌ శాస్త్రవేత్తల సహకారంతో ఆర్మీ వైమానిక దళం ఈ పరీక్షను నిర్వహించిందని సీనియర్‌ అధికారి గురువారం ప్రకటించారు. తూర్పు లద్దాక్‌లో 15,000 అడుగుల ఎత్తులో రెండు రోజుల పాటు ఈ పరీక్షను నిర్వహిం చారని తెలిపారు. ఎత్తైన వాతావరణంలో వేగంగా కదులుతున్న వైమానిక లక్ష్యాలపై ఆకాశ్‌ ప్రైమ్‌ రెండు ప్రత్యక్ష దాడులు ఆకాశ్‌ ప్రైమ్‌ ప్రయోగం విజయవంతం చేపట్టిందని అన్నారు. మొదట దీనిని ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రయోగించారని, ఫలితాలు బాగున్నాయని అధికారి తెలిపారు. ఆకాశ్‌ ప్రైమ్‌లో వాతావరణం, భూభాగంతో సంబంధం లేకుండా మెరుగైన కచ్చితత్వాన్ని సాధించేందుకు స్వదేశీ యాక్టివ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్‌) స్పీకర్‌ను అమర్చారు. ఇది మధ్యస్థ-శ్రేణి రక్షణ వ్యవస్థ. ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను ప్రయోగించడంతో పాటు మొబైల్‌, సెమీ మొబైల్‌, స్థిరమైన సైనిక స్థావరాలను వైమానిక దాడుల నుంచి రక్షిస్తుంది. దీనిని 4,500 మీటర్ల ఎత్తులో కూడా ప్రయోగించవచ్చు. సుమారు 25-30 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad