Saturday, December 13, 2025
E-PAPER
Homeకరీంనగర్వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా ఆరట్టు మహోత్సవం

వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా ఆరట్టు మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆరట్టు మహోత్సవాన్ని భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. శనివారం అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

ఆలయ చైర్మన్  కొండ దేవయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం అయ్యప్ప స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, గణపతి హోమం వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అలాగే దేవాలయంలో గజగౌరీ వ్రతం, ఆలయం ముందున్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం, అభిషేకాలు నిర్వహించారు.“స్వామియే శరణమయ్యప్ప” అనే భక్తుల శరణుఘోషలతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. మధ్యాహ్నం అయ్యప్ప స్వామివారికి భిక్ష సమర్పణతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య గురుస్వామి భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

 ఆరట్టు మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్…
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామి వారి ఆరట్టు మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చల్మెడ లక్ష్మీనర్సింహరావు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొనగా, అయ్యప్ప నామస్మరణతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. స్వామి వారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ఆయన ప్రార్థించారు.

ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర ప్రతాప రామకృష్ణ, న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, పొలాస నరేంధర్, రామతీర్థపు రాజు, బింగి మహేష్, కుమ్మరి శంకర్, చంద్రగిరి శ్రీనివాస్, కట్కూరి శ్రీనివాస్, నిమ్మశెట్టీ విజయ్, మారం కుమార్, నీలం శేఖర్, సిరిగిరి చందు, నరాల శేఖర్, గొలి మహేష్, బత్తుల మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -